Wednesday, 4 November 2026

మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలల్లో చేపట్టిన మేజర్, మైనర్ నిర్మాణ పనులను ప్రోగ్రెస్ లోకి తీసుకురావాలి-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

 

గద్వాల నడిగడ్డ, జులై 6 (జనం సాక్షి);

మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద పాఠశాలలో చేపట్టిన మేజర్, మైనర్ నిర్మాణ పనులు ప్రోగ్రెస్ లోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.
గురువారం ఐ డి ఓ సి కాన్ఫరెన్సు సమావేశం హాలు నందు పంచాయతి రాజ్ ఈ ఈ . డి ఇ లు ,ఎ ఇ లతో పల్లె దవాఖానలు, మన ఊరు మన బడి కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు మన ఊరు, మనబడి కార్యక్రమం ద్వారా సూచించిన పనులను త్వరిత గతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మన ఊరు, మనబడి కార్యక్రమం క్రింద జిల్లాలో ఎంపికైన 161 పాఠశాలలకు గాను 11 మాత్రమే ప్రారంభించుకున్నామని, మిగతా పాఠశాలలలో , మరుగుదొడ్లు నిర్మాణ పనులు ,అదనపు గదులు, డ్రింకింగ్ వాటర్,ఎలక్ట్రిసిటీ పనులు వెంటనే పూర్తిచేఇంచాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాలలో ఎక్కడైతే పనులు పెండింగ్ ఉన్నవో అక్కడ మేజర్, మైనర్ రిపేరు పనులు పూర్తి చేఇంచాలని, పనులు పూర్తి చేయకుండా సమస్యలు ఏమున్నాయని ,ఈ పథకం ద్వారా పాఠశాలలలో గదులు టాయిలెట్లు వంట గదులు కాంపౌండ్ వాల్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఎందుకు జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించారు. మండలాల వారిగా సమీక్షించారు.మండలాలలోని జడ్పీ హైస్కూల్లో, ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు ,
అదనపు గదుల నిర్మాణం పనులు పూర్తి ప్రోగ్రెస్ లోకి రావాలని , జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనులు జరిగినవి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఏ ఇ లు వ్యక్తి గత శ్రద్ద పెట్టి టెండర్లు పూర్తి అయిన పాఠశాలలో కాంపౌండ్ వాల్ , మరుగుదొడ్లు , ఇతర సదుపాయాలు పర్యవేక్షించి పనులు మొదలు పెటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో హెల్త్ సబ్ సెంటర్ల పనులు, మన ఊరు మనబడి క్రింద చేపట్టిన పనులుజులై చివరి నాటికి పూర్తి చేయాలనీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో చేపట్టిన బస్తీ దవాఖానలు పనులు ఎంతవరకు వచ్చాయని, అన్ని గ్రామాలలో పిహెచ్సి పనులు ముమ్మరం చేసి ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె దవాఖానాల పనులు పూర్తిచేసి కలరింగ్ చేసి , ప్రారంభానికి సిద్దం చేయాలన్నారు. ఈ సందర్భంగా పల్లె దవాఖాన గురించి పెండింగ్ లో ఉన్న పనులు , పూర్తి చేసిన పనులకు సంబందించిన వివరాలు ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలన్నారు.హెల్త్ సబ్ సెంటర్ల గురించి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం పనులు నత్తనడకన నడుస్తున్నాయని, త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సబ్ సెంటర్ల కు కిటికీలు దర్వాజాలు బిగించి పెయింటింగ్ వేయించాలన్నారు. అడ్మిన్ శాంక్షన్కు ఫైల్ పెట్టాలని ఆదేశించారు. నిర్మాణ పనులలో అలసత్వం వహించరాదని,స్కూల్ వారిగా పనులు పూర్తి చేసి ఆన్లైన్ రికార్డు నమోదు చేయాలన్నారు.జిల్లాలోని పాఠశాలలలో పెండింగ్ పనులను పర్యవేక్షించి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ , జిల్లా విద్యా శాఖదికారి సిరాజుద్దీన్ ,పి ఆర్ ఈ ఈ ఆంజనేయులు, డి ఎం అండ్ ఎచ్ ఓ శశికళ , డి ఇ లు, ఏ ఇ లు, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.