Wednesday, 4 November 2026

బయటపడ్డ ఉపాధి హామీ పని డబ్బుల బాగోతం సంతకాలు లేకుండానే డబ్బులు డ్రా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి

 

 

 

 

 

 

ఏటూరునాగారం (జనంసాక్షి)జులై 06.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజలకు అందించే పనికి ఆహార పథకం జాతీయ ఉపాధి హామీ పథకం.ఈ పథకానికి 100 రోజుల పని కోరుతూ అర్జీ పెట్టుకుంటే గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ అర్జీలను పరిశీలించి పని నడిపిస్తారు. కానీ రామన్నగూడెం గ్రామ పంచాయతీ లో వారం రోజులు రోస్టర్ లో సంతకాలు పెట్టకుండానే ఓ గ్రూపు సభ్యులు డబ్బులు పొందారు. ఈ విషయం గురువారం నాడు గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభ లో ఆడిట్ చేసిన అధికారులు నేరుగా ప్రజల ముందు పెట్టారు. గత మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ లను వీధుల్లో నుండి తొలగించి పంచాయతీ కార్యదర్శి లకు భాద్యతలు అప్పగించారు. అదే విధంగా గడిచిన సంవత్సరం లో ఉపాధి హామీ పథకంలో చాలా అవకతవకలు బయటపడ్డ విషయం ఈ రోజు తెలిసింది.ఇందులో సంబంధిత అధికారులు పర్యవేక్షణ, తనికీ ఒక్క రోస్టర్ లో సందర్శించిన తేదీ సంతకాలు లేకపోవడం వల్లనే తప్పులు జరిగినట్లు క్షుణ్ణంగా కనిపించింది. రేపు మండల రౌండ్ టేబుల్ సమావేశంలో ఇట్టి విషయం మీద తగు చర్యలు తీసుకొని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన భాద్యుల నుండి సొమ్ముని రికవరీ చెయ్యాలని ప్రజలు కోరారు.ఈ గ్రామ సభలో గ్రామ సర్పంచ్ దొడ్డ కృష, కారొబార్ వెంకటేశ్వర్లు, 9 మంది వార్డు సబ్యులకు గాను శ్రీదేవి, పోశాలు హాజరవగా,ఫీల్డ్ అసిస్టెంట్ రఘు, ఆడిట్ అధికారులు మరియు సమస్యల మీద విన్నవించుకోవడానికి వచ్చిన గ్రామ ప్రజలు పాల్గొన్నారు.