*మన పాలన మనమే చేసుకుందాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ రూరల్ ఆగస్టు 21 జనం సాక్షి
వికారాబాద్ ప్రాంతాన్ని మన ప్రాణికులమే పరిపాలించుకునేలా ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం శ్రమించాలని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు సోమవారం ఎమ్మెల్యే ధరూర్ మండల నాయకులుసమక్షంలో ధారూర్ మండల పరిధిలోని మున్నూరుసోమారం”గ్రామానికి చెందినకాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ బైండ్ల శ్రీశైలం* విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్,* కాంగ్రెస్ పార్టీ సీనియర్* నాయకులు
సంగమేశ్వర్, గోపాల్, అనంతయ్య, కిష్టయ్య, ఎల్లయ్య, వీరేశం, రమేష్,* “కాచారం” నుండి వడ్ల శ్రీకాంత్, రాములు, అక్బర్, అల్లావుద్ధిన్, మల్లేష్, శ్రీనివాస్,ధర్మాపూర్” నుండి నర్సిములు, గోవర్ధన్, శ్రీనివాస్, కొండారెడ్డి, అమరేందర్ రెడ్డి, యాదయ్యవారి అనుచరులు కాంగ్రెస్, బిజెపి నుండి 60 మంది బి.ఆర్.ఎస్ లో చేరారు.ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ.వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
వికారాబాద్ నుండి గతంలో స్థానికేతరులకు అవకాశం ఇచ్చి చాలా నష్టపోయామని, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే అభివృద్ధిని చేసుకోలేకపోయమని, కాబట్టి మన వికారాబాద్ ప్రాంతంలో మనమే పాలన చేసుకుందామన్నారు.
ఈ కార్యక్రమంలో ఇది మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు మండల పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ వేణుగోపాల్ రెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.