మమ్మల్ని గుర్తించండి
బచ్చన్నపేట (జనం సాక్షి) జూన్ 10:
మీ ఆరోగ్యం కోసం మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న గ్రామపంచాయతీ ఉద్యోగులను గుర్తించాలని . బచ్చన్నపేట గ్రామపంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం బచ్చన్నపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు చేస్తున్నటువంటి సమ్మె సోమవారం నాటికి ఐదవ రోజుకు చేరుకుంది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. చాలీచాలని జీతంతో జీవితాన్ని గడుపుతున్న గ్రామపంచాయతీ ఉద్యోగులని పర్మినెంట్ చేస్తూ మిగతా సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెలో గంధ మల్ల సిద్ధులు. గ్యార కిష్టయ్య. రమేష్. శివ. నీల వెంకటేష్. దేవయ్య. రాజు. ఎల్లమ్మ. బాబు గౌడ్. ప్రభాకరు సిబ్బంది పాల్గొన్నారు