Thursday, 5 November 2026

మయమవుతున్న బొందల గడ్డ పట్టించుకోని అధికారులు

మయమవుతున్న బొందల గడ్డ పట్టించుకోని అధికారులు గ్రామపంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేసిన పట్టించుకోరా బాధిత ప్రజల ఆవేదన ..??

జనం సాక్షి/ కొల్చారం
తాతల్నాటి నుంచి ఉన్న తమ కుటుంబీకుల బొందలను తవ్వేస్తూ ఓ వ్యక్తి ఇంటి చుట్టూరా ప్రహరీ గోడను నిర్మిస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం బీసీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము భూములు అడుగుతున్నామా? ఆస్తులు అడుగుతున్నామా? సస్తే బొంద పెట్టుకునే జాగ… సర్కార్ కోట గడ్డలో మా కుటుంబీకుల బొందలు తవ్వేసి తన ఓ వ్యక్తి తన ఇంటి చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తుంటే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. మండల కేంద్రమైన కొల్చారం బీసీ కాలనీలో కోటగడ్డ పక్కన ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చింది. కాలనీవాసులకు స్థలాలు లేక వారి కుటుంబాల్లో ఎవరు చనిపోయిన కోట గడ్డ వెంట బొంద పెడతారు. 20 రోజుల క్రితం ఓ వ్యక్తి ప్రభుత్వ కోట గడ్డను తవ్వేసి తన ఇంటి చుట్టూరా ప్రహరీ గోడ నిర్మిస్తుంటే పంచాయతీ కార్యదర్శికి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అతడు వీటన్నిటినీ ఖాతరు చేయకుండా యదేచ్చగా కాంపౌండ్ వాల్ నిర్మిస్తుండడంతో అధికారుల తీరు పట్ల కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి ఎవ్వరి బెదిరింపులకు భయపడకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే గ్రామపంచాయతీ అధికారులపై జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేయనున్నట్లు బీసీ కాలనీవాసులు తెలిపారు.