సీఎం సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి
బాల్కొండ డిసెంబర్ 5 (జనం సాక్షి ) బాల్కొండ మండలం వన్నెల్ బి, గ్రామం లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు వన్నెల్. బి గ్రామం లో తెరాస కార్యాలయం వద్ద గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ చారి అధ్యక్షత నా తెరాస కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా బాల్కొండ మండల రైతు సమన్యాయ సమితి అధ్యక్షుడు నాగులపల్లి రాజేశ్వర్, ఉపసర్పంచ్ నాగులపల్లి కిషన్, గ్రామ నాయకులతో కలిసి వారు మాట్లాడారు.ఈనెల 7న జగిత్యాల జిల్లా మోతెలో జరిగే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈసభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైతుందని రైతులు,యువకులు,తెరాస శ్రేణులు,ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ తెరాస గ్రామ అధ్యక్షుడు శ్రీకాంత్ చారి,ఉప సర్పంచ్ నాగులాపల్లి కిషన్,
బాల్కొండ మండల రైతు సమన్యాయ సమితి అధ్యక్షుడు నాగులపల్లి రాజేశ్వర్,గ్రామ తెరాస రైతు సమన్యాయ సమితి అధ్యక్షుడు పన్నాల గంగారెడ్డి, తెరాస పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




