Wednesday, 4 November 2026

మరీ ఇంత అనైతికమా: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమంతటి అనైతిక ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీలో ఇష్టానుసారం ఆస్తిపన్ను వసూలు చేస్తుండడంపై ఇందిరాపార్కులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్క రోజు నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రుల ముందు చెత్తకుండీలు పెడుతూ.. పన్నులు కట్టనివారి ఇళ్ల ముందు చావుడప్పు మోగిస్తూ ప్రజలను ఈ ప్రభుత్వం అవమానపరుస్తోందన్నారు. ఓల్డ్‌సిటీలో పన్నులు వసూలు చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. హైరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచకపోతే సీఎం నివాసం ముందు చెత్తవేస్తామన్నారు. ప్రజలపై భారం వేసే హక్కు ఎవరిచ్చారంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్‌ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం ఎందుకు పన్ను కట్టడం లేదని ప్రశ్నించారు. 65 సంవత్సరాలు కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు సుఖం లేదన్నారు. ఇంటిపన్నులపై వడ్డీలు, చక్రవడ్డీలు వేయడం సరికాదని లక్ష్మణ్‌ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *