మరో మధ్యప్రదేశ్ వాసిని బలిగొన్న శనగనూర్పిడి యంత్రం…
– ఉపాధికోసం వచ్చినవాసిలను ఉసురు తీసుకుంటున్న యంత్రలు…
– మొన్న ముధోల్ మండలం,నేడు తానూర్ మండలలలో ఘటనలు…
– శరీరం నుండి వేరైన తల, మొండెం.
భైంసా. రూరల్ ఫిబ్రవరి 28
ముథోల్ మండలంలోని విఠోలి గ్రామంలో శనగలు నూర్పిడి చేస్తుండగా యంత్రంలో పడి మధ్యప్రదేశ్ యువకుడి మృతి ఘటన మర్చిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. తానూర్ మండలంలోని కర్బాల గ్రామంలో ఆదివారం రాత్రి ఇదే తరహా విషాద ఘటన జరిగి అదే రాష్ట్రానికి చెందిన మరో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కర్బాల గ్రామానికి చెందిన ఒక రైతు శనగలను చేనులో నూర్పిడి చేస్తుండగా సంబంధిత యంత్రంపై పని చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన దినేష్ (26) ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. గత కొంత కాలంగా ఉపాధి కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నూర్పిడి యంత్రంపై ఇక్కడి ప్రాంతానికి వచ్చి పని చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆదివారం కర్బాలలో శనగలను నూర్పిడి చేస్తుండగా యంత్రంలో పడి చుట్టుకపోయాడు. దీంతో అతని శరీరం తల, మొండెం వేర్వేరుగా వీడిపోయాయి. ఉపాధి కోసం వచ్చిన ఆయనను నూర్పిడి యంత్రం ఊసురు తీసుకుంది. రాత్రి వేళలో మృతదేహానికి సంబంధించిన తల, మొండెం భాగాలను పోస్టుమార్టం నిమిత్తం బైంసా పట్టణ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మరో మధ్యప్రదేశ్ వాసిని బలిగొన్న శనగనూర్పిడి యంత్రం…




