Wednesday, 4 November 2026

మరో ముగ్గురు మంత్రులు జైలుకు వెళ్తారు పయ్యాపుల

హైదరాబాద్‌ : త్వరలో మరో ముగ్గురు మంత్రులు జైలుకు వెళ్తారని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశప్‌ అన్నారు. శాసనసభలో కళంకిత మంత్రులపై చర్చ సందర్భంగా కేశప్‌ మాట్లాడుతూ… మంత్రులపై విచారణ జరపాలని హైకోర్టుకు వెళ్లింది తొలుత తెలుగుదేశం పార్టీయేనని స్పష్టం చేశారు. దొంగలబండికి ముఖ్యమంత్రి సారథ్యం వహిస్తున్నారని విమర్శించారు. దీనిపై ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ… మాపై పిటీషనర్‌ ఏం వేశారో తెలీకుండా తెదేపా మాట్లాడుతోందన్నారు. తెదేపా అరోపణలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ధర్మాన ప్రకటించారు. చంద్రబాబు సభలో ఉంటే వారి పార్టీ చేస్తున్న విమర్శలను సమర్థించే వారుకాదని వ్యాఖ్యానించారు. ధర్మాన వ్యాఖ్యలను ఖండించిన తెదేపా సభ్యులు కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ పోడియంను చట్టుముట్టి ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *