Wednesday, 4 November 2026

4:30 గంటలకు వాయిదా పడిన శాసనసభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ సాయంత్రం 4:30 గంటలకు వాయిదా పడింది. సభలో అధికార పక్షం ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. కళంకిత మంత్రులను వెనకేసుకొచ్చిన సీఎంపై టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దొంగల పార్టీ అన్న మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై పయ్యావుల కేశవ్‌ నిప్పులు చెరిగారు. అధికార పక్షం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ సభ్యులు స్నీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *