Wednesday, 4 November 2026

మలేషియా అంతర్జాతీయ క్రీడలకు (మలేషియా) ఎంపికైన

మలేషియా అంతర్జాతీయ క్రీడలకు (మలేషియా) ఎంపికైన మహేందర్ రెడ్డిని సన్మానించిన సంతోష్ సింగ్.
బెల్లంపల్లి, నవంబర్ 29, (జనంసాక్షి )

సీనియర్ వెటరన్ అథ్లెటిక్ క్రీడాకారుడు మహేందర్ రెడ్డి (63) అంతర్జాతీయ క్రీడలకు ఎంపికైనారు. బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని మండల కేంద్రానికి చెందిన మహేందర్ రెడ్డి డిసెంబర్ 3 వ తేదీ మలేషియాలో జరగబోయే అథ్లెటిక్ క్రీడలలో పాల్గొనబోతున్నాడు. ఈసంధర్భంగా మహేందర్ రెడ్డిని అభినందిస్తూ డాక్టర్ సంతోష్ సింగ్ శాలువాతో సన్మానించారు. అంతర్జాతీయ క్రీడల్లో విజయజేతనం ఎగురవేయాలని, అలాగే బెల్లంపల్లి నియోజకవర్గానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ సేన ,ఉష శ్రీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు