హైదరాబాద్:2014 మార్చిలో అదృశ్యమైన… మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి సంబంధించిన ఆధారాలు… తొలిసారిగా లభ్యమయ్యాయి. హిందూ మహాసముద్రంలోని ఓ మారుమూల దీవిలో 2.7 మీటర్ల పొడవు, 0.9 మీటర్ల వెడల్పైన విమాన రెక్కభాగాన్ని అధికారులు గుర్తించారు. ఈ శకలం బోయింగ్ 777 విమానానికి చెందిందై ఉండొచ్చని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ తెలిపారు. ఆఫ్రికా తూర్పు తీరంలోని… లా రీయూనియన్ అనే ఫ్రెంచ్ దీవిలో దీన్ని గుర్తించారు. అయితే ఈ శకలం అదృశ్యమైన మలేషియా ఎంహెచ్-370 భాగమేనా..? కాదా..? అన్న విషయం తేలాల్సి ఉందని నజీబ్ ఫేస్‌బుక్ పేజీలో తెలిపారు.




