మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి ఆదాయం రూ.17,49,620
మల్దకల్ అక్టోబర్ 28 (జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరగగా రూ.17,49,620 ఆదాయం లభించినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ,ఆలయ వ్యవస్థాపక వంశీయులు పట్వారి ప్రహల్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు.ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు జరిగే హుండీ లెక్కింపు కార్యక్రమంలో గత ఏడాది రూ. 10,93, 537 రాగ ఈసారి రూ. 6,56,083 లు అదనంగా ఆదాయం లభించినట్లు వారు తెలిపారు. చింతల ముని దేవాలయం హుండీ లెక్కించగా 41,725 రూపాయలు రాగా గత సంవత్సరం 26,580 రూపాయలు, 15,145 రూపాయలు అదనంగా వచ్చిందని వారు తెలిపారు. గద్వాల పట్టణ ఆరెకటిక,ఆర్యవైశ్య సంఘం మహిళా సభ్యులు హుండీ లెక్కించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాకోబు,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,సీతారాంరెడ్డి,అరవిందరావు,చంద్రశేఖర రావు,చంద్రశేఖర్ రెడ్డి,వీరారెడ్డి,జమ్ములమ్మ దేవస్థానం డైరెక్టర్ అభిలాష్, బాబురావు,ఆలయ ఇబ్బంది, వాల్మీకి పూజారులు, కొండికారులు తదితరులు పాల్గొన్నారు.




