Thursday, 5 November 2026

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న అధికార పార్టీ.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న అధికార పార్టీ.
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్28 (జనంసాక్షి):

రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ క్రీడలు జుగుస్స కరంగా మారాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసి కాంగ్రెస్ టిడిపి గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని నేడు నీతులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ ఫిరాయించి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి టిఆర్ఎస్ గుర్తుపై గెలిచి నైతికతను నిరూపించుకోవాలని నాగం డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలలో అధికార పార్టీ చేస్తున్న ఖర్చు వందల వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. బిజెపి కూడా రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతుందని రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర నిర్వహిస్తూ ఉంటే గోవాలో ప్రభుత్వాన్ని పడగొట్టడం దేనికి సంకేతం అని అన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, మునిసిపాలిటీ అధ్యక్షులు తిమ్మాజీపేట పాండు,సీనియర్ నాయకులు నారాయణ గౌడ్, బాలా గౌడ్, లక్ష్మయ్య,గోవర్ధన్ రెడ్డి, అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు.