Tuesday, 3 November 2026

మల్లారెడ్డిపల్లి లో బిజెపి పార్టీ బూత్ కమిటీలు ఏకగ్రీవ ఎన్నికమ

ల్లారెడ్డిపల్లి లో బిజెపి పార్టీ బూత్ కమిటీలు ఏకగ్రీవ ఎన్నిక ముఖ్య అతిథిగా బిజెపి పార్టీహుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి
వీణవంక ఏప్రిల్ 4 (జనం సాక్షి) వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో ముఖ్య అతిధి  బిజెపి పార్టీ  హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి,బిజెపి మండల అధ్యక్షులు  ఆదిరెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ మండలంలోని మల్లారెడ్డి పల్లి గ్రామంలో  నూతన కమిటీ ఎన్నుకున్నారు.93,94బూత్ అధ్యక్షులుగా కర్రె నాని, కొలిపాక శ్రీనివాస్,కార్యదర్శులుగా గోనెల పెద్దులు,ఆర్సం శ్రీనివాస్,ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ బిజెపి  పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, మా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ  సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి. నాయకులు మారం తిరుపతిరెడ్డి. సంధి సురేందర్ రెడ్డి,పల్లేర్ల కిరణ్,దూలం సురేష్, నల్లవెల్లి శంకర్,చంద్రయ్య,కనకయ్య,రమేష్,శ్రీను,కుమార్, రవి,ప్రశాంత్,శ్రీకాంత్, అనిల్ తదితరులు తోపాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.