.ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు నియంత్రించాలి..
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవెల్లి నాగరాజు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 4. (జనంసాక్షి). జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులను నియంత్రించాలని అనుమతి లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రబెల్లి నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ప్రజల నుండి ఫీజుల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా వైద్యాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి ఫీజులను నియంత్రించాలని అనుమతి లేని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జువ్వాజి విమల, మల్లారపు ప్రశాంత్, మహమ్మద్ ఆక్రమ్, సుధీర్ పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు నియంత్రించాలి.




