Tuesday, 3 November 2026

మల్లెందొడ్డిలో కంటి వెలుగు ప్రారంభించిన ఎంపీపీ

మల్దకల్  మార్చి 3 (జనంసాక్షి) మల్దకల్ మండలంలోని మల్లెం దొడ్డి గ్రామపంచాయతీలో శుక్రవారంకంటి వెలుగు ఉచిత శిబిరం ఎంపీపీ రాజారెడ్డి,జెడ్పిటిసి వై ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రాజారెడ్డి,జెడ్పిటిసి వై ప్రభాకర్ రెడ్డి,వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న,కో ఆప్షన్ సభ్యులు హైదర్ అలీ,గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి,ఎంపీటీసీ సభ్యులు పరుశరాములు, టిఆర్ఎస్ మాణిక్ రెడ్డి,ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.గ్రామ ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలని ఎంపీడీవో జీ కృష్ణయ్య అక్కడికి వచ్చిన ప్రజలకు తెలియజేశారు.డాక్టర్ మాట్లాడుతూ రోజు 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించబడుతున్న కావున మీరందరూ సహకరించి,ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ నవీన్ కోరారు. పంచాయతీ కార్యదర్శి కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.