Tuesday, 3 November 2026

మహమ్మద్ ఖాదర్ బజార్ బోర్డు తొలగించి చేపల మార్కెట్ బోర్డు ఏర్పాటు చేయండి మత్స్య పారిశ్రామిక మహిళా సొసైటీ అధ్యక్షురాలు భయ్యా మంజుల డిమాండ్.

మహబూబాబాద్ మార్చి 03 (జనం సాక్షి) :-  ఎన్నో  ఏండ్ల నుండి కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలకు నిలయమైన చాపల మార్కెట్ బజార్ పెరును మార్చి మా మత్స్యకారుల కుటుంబాలను అవమానించారని అన్నారు మహిళా సహకార సంఘం సొసైటీ అధ్యక్షురాలు బయ్య మంజుల గారు కొంతమంది రాజకీయ స్వార్థం కోసం సొంత లాభాల కోసం వ్యక్తిగత పేర్లు బజార్ పేరుగా పెట్టడం ఎంతవరకు సబబు అని అన్నారు. ఈరోజు చేపల మార్కెట్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని మహమ్మద్ ఖాదర్ బజార్ బోర్డు ను తొలగించాలని స్థానిక 32 వ వార్డు కౌన్సిలర్ కర్పూరపు పద్మ గారికి మహిళా సొసైటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1000 కుటుంబాలకు పైగా చాపల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని విన్నవించారు.  ఇట్టి కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సొసైటీ కార్యదర్శి పిల్లి దశరథం, మత్స్యకార మహిళా సభ్యులు డోలి ఆగమ్మ, అవారి రాధా, పిల్లి సరస్వతి, పిల్లి ఈరమ్మ, చుక్కల కలమ్మ, సింగానీ కనక లక్ష్మి, గంగపుత్ర సంఘం సభ్యులు దేశ బోయిన రవి, చుక్కల నరేష్, అవారి సునీల్, దేశ బోయిన రామ్మూర్తి, గోపు ఉప్పలయ్య  తదితరులు పాల్గొన్నారు