Tuesday, 3 November 2026

మహనీయుల ఆశయ సాధన దిశగా నార్నూర్

.మహనీయుల ఆశయ సాధన దిశగా నార్నూర్.
ఘనంగా రామనవమి ఉత్సవాలు.చల్లటి పానీయాన్ని పంపిణి చేసిన ముస్లిం సోదరులు.జనం సాక్షి  ఉట్నూర్.నార్నూర్ మండల కేంద్రంలో మార్చ్ 30న రామ నవమి జయంతి నిర్వహించారు. జయంతి సందర్భంగా సేవలాల్ చౌక్ నుండి జలంసింగ్ చౌక్ వరకు శోభయాత్ర భక్తిశ్రద్ధతో నిర్వహించారు. శోభయాత్ర నిర్వహించిన సమయంలో అతిగా ఎండ ఉండడంతో తోటి సోదరులకు ఇబ్బంది కలగకూడదని ముస్లిం సోదరులు గాంధీ చౌక్ వద్ద చల్లటి పానీయాన్ని నిమ్మరసం పంపిణీ కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గజానంద్ నాయక్ ఆడే సురేష్ సుల్తాన్ ఖాన్ నార్నూర్ ఎస్ఐ రవి కిరణ్గాదిగుడా ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్  రాథోడ్ భిక్కు జావిద్ ఖాన్ ధర్మ రక్షక్ సోహేల్ ఖాన్ ఉత్తమ్ రాథోడ్ జై భారత్ కార్యకర్తలు పెందుర్ దీపక్ జైహో కార్యకర్త రాహెల్ ఖాన్ షేక్ నసిర్ సంతోష్ సునార్ రైస్ రెడ్డి నాయక్ రమిస్ శభాష్ ఖాన్ యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.