భువనగిరి టౌన్ జనం సాక్షి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సమన్వయ కమిటీ కన్వీనర్
ఈనెల 11న జరిగే మహాత్మా జ్యోతిరావు పూలే 197 జయంతి ఉత్సవాలను ఎస్సీ ఎస్టీ బిసి, మైనారిటీ ప్రజలంతా కలిసి విజయవంతం చేయాలని ఉత్సవాల సమన్వయ కమిటీ కన్వీనర్ మాటూరి అశోక్ కోరారు. శుక్రవారం స్థానిక ఎస్వీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈనెల 10న మహా బైక్ ర్యాలీ నిర్వహించాలని ఆయన కోరారు.అలాగే 11న మంగళవారం ఉదయం 9 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ప్రారంభం చేసుకోవాలని ఆయన కోరారు. సంఘసంస్కర్త, మహిళా పక్షపాతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలందరూ స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సమన్వయ కమిటీ కో_ కన్వీనర్ కొత్త నర్సింహ స్వామి, రావుల రాజు, ఏశాల అశోక్, కొడారి వెంకటేష్, గుర్రం వసంత, పిట్టల బాలరాజు, మచ్చ నర్సింహ, దేవరకొండ నర్సింహ చారి, కొత్త బాలరాజు, నాయకులు తంగెళ్ళఫల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్ కుమార్, బెండె శ్రీకాంత్, పచ్చర్ల జగన్, జక్కుల మల్లేష్, నీలం నర్సింహ, ఈరబోయిన నాగభూషణం తదితరులు పాల్గొన్నారు




