Friday, 6 November 2026

మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప మానవతావాది.

మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప మానవతావాది.
టిడి పార్లమెంట్ ఇంచార్జి మంతటి గోపి మాదిగ.
తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో ఘనంగా 132వ వర్ధంతి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్28 (జనంసాక్షి):

 

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి మంతటి గోపి మాదిగ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువసేన కన్వీనర్ సుక్క వెంకటస్వామి హాజరై మాట్లాడుతూ తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ ఆదేశాల మేరకు పూలే వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. సమాజంలో అనగారిన వర్గాల అభ్యున్నతికై, విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది, మహాత్మా జ్యోతిబాపూలే అని అన్నారు.11 ఏప్రిల్ 1827 మహారాష్ట్రలో జన్మించారని తెలిపారు. సాంఘిక దురాచకాలకు వ్యతిరేకంగా కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. తెలంగాణ దండోరా పార్లమెంట్ ఇన్చార్జి మంతటి గోపి మాదిగ మాట్లాడుతూ విద్యా హక్కుల గురించి నిరంతరం పోరాడిన యోధుడు మహిళ విద్యకు కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త, సావిత్రిబాయి పూలే భారత దేశంలో మహిళలకు, విద్యార్థులకు మార్గదర్శకురాలని,పూలే బాలికల కోసం మొదటిసారి 1848లో పాఠశాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సావిత్రిబాయి పూలే,మహాత్మ జ్యోతిరావు పూలే ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచారని చెప్పారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా గౌరవ అధ్యక్షులు దర్శనాల సాయికుమార్, జిల్లా అధ్యక్షులు బొల్లె విష్ణు మాదిగ, భాస్కర్, లక్ష్మయ్య, మల్లయ్య, పాదాల మధు, తదితరులు పాల్గొన్నారు