Wednesday, 4 November 2026

మహారాష్ట్ర మంత్రివెంటనే క్షమాపణ చెప్పాలి.

మహారాష్ట్ర మంత్రివెంటనే క్షమాపణ చెప్పాలి…

భైంసా రూరల్ డిసెంబర్ 10 జనం సాక్షి

 

మహారాష్ట్ర మంత్రి వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని దళిత యువజన సంఘాలు,ఎన్.ఎస్.యు.ఐ జిల్లా బాధ్యుల ఆద్వర్యం లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగామాట్లాడుతూ…ఇటివల మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను, జ్యోతిబాపూలే,సావిత్రిబాయి పూలే ముగ్గురు సంస్కర్తలు బిచ్చమెత్తుకుని విద్యాసంస్థల్ని స్థాపించారని కించపరుస్తూ మాట్లాడ0 ఎంతవరకు సబబని ఒకవేళ ఆ సమయంలో విద్యాసంస్థలు స్థాపించకపోతే మీరు ఎక్కడ చదువుకొని ఇటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కొనసాగుతున్నారని వారు ప్రశ్నించారు.ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరమని సమాజంలో అజ్ఞానులను విద్యావంతులుగా చేయడానికి తమ భార్యా పిల్లలు ఆభరణాల సైతం ఆమ్మి కూడా సమసమాజ నిర్మాణానికి ఆహుతులైనారని మరొక్కసారి గుర్తు చేశారు.చంద్రకాంత్ పాటిల్ తన మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ఇప్పుడు ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశలవారీగా పోరాటాలు చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అమూల్ సోంకాంబ్లే,సాహెబ్ రావు కాంబ్లే ఎన్ ఎస్ యు ఐ జిల్లా బాధ్యులు అంజద్ షేక్, స్వప్నిల్,సచిన్,అనికేత్ తదితరులు
పాల్గొన్నారు.