Wednesday, 4 November 2026

న్యాయవాదుల సంక్షేమ చట్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి

న్యాయవాదుల సంక్షేమ చట్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి

*న్యాయవాదులపై జరిగే దాడులను అరికట్టాలి

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ AILU రాష్ట్ర కార్యదర్శి అనంతుల శంకరయ్య డిమాండ్

రామన్నపేట డిసెంబర్ 10 (జనంసాక్షి)
న్యాయవాదుల సంక్షేమ చట్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని,న్యాయవాదులపై జరిగే దాడులు హత్యలను అరికట్టాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ AILU రాష్ట్ర కార్యదర్శి అనంతుల శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రామన్నపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమ నిధికి సంవత్సరానికి కోటి రూపాయలను విడుదల చేయాలని ఆయన కోరారు. జూనియర్ న్యాయవాదులు అందరికీ నెలకు పదివేల చొప్పున ఐదు సంవత్సరాలు ఉపకార వేతనం ఇవ్వాలని ఆయన అన్నారు. న్యాయవాది చనిపోతే కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో AILU సీనియర్ నాయకులు బొడిగ లక్ష్మయ్య , మామిడి వెంకట్ రెడ్డి ,యాదాసు యాదయ్య, తదితరులు పాల్గొన్నారు