Thursday, 5 November 2026

మహా పడిపూజ

మహా పడిపూజ

రాజంపేట్ (జనంసాక్షి) నవంబర్ 24

రాజంపేట్ మండల కేంద్రంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం నిర్మిస్తున్నట్టు అయ్యప్ప సేవా సమితి గురు స్వాములు ఓ ప్రకటనలో తెలిపారు రాజంపేట్ మండల కేంద్రంలోని శుక్రవారం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అయ్యప్ప పడిపూజ 19వ అయ్యప్ప మహా పూజను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు అయ్యప్ప మహా పడిపూజ అనంతరం మధ్యాహ్నం 1గంటకు తీర్థ ప్రసాదాలు భిక్ష అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి అయ్యప్ప మాల ధరించిన స్వాములు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు మహా పడిపూజను అనంతరం సాయంత్రం 7 గంటలకి అయ్యప్ప స్వామి వారిని ఊరేగింపు మరియు భజన అనంతరం అల్పాహారం ఈ కార్యక్రమాలు ఉంటాయని కావున పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం విజయవంతం చేయాలని రాజంపేట్ అయ్యప్ప సేవా సమితి అయ్యప్ప స్వాములు కోరారు