Wednesday, 4 November 2026

మహా ర్యాలీకి వేలాదిగా తరలి వెళ్లిన లింగాయతులు

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూన్ 4 :- తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో తలపెట్టిన లింగాయత్ మహా ర్యాలీ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా కేంద్రం నుండి వేలాదిమంది లింగాయతులు ఆదివారం ఉదయం ర్యాలీగా తరలి వెళ్లారు.సంగారెడ్డి జిల్లా కేంద్రం ఉండే కాకుండా పలు పట్టణాలు జహీరాబాద్ పటాన్చెరు జోగిపేట్ నారాయణఖేడ్ రామచంద్రాపూర్ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన లింగాయతులు వేలాదిగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా లింగాయత్ సమాజ నాయకులు మాట్లాడుతూ లింగాయతులను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే దేశ రాజధానిలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అనుభవమంటపము అని నామకరణం చేయాలన్నారు. మహాత్మా బసవేశ్వరుని సూక్తులు జీవిత చరిత్ర కేజీ నుంచి పీజీ వరకు అన్ని భాషల్లో ప్రచురించాలని డిమాండ్ చేశారు. అలాగే అసెంబ్లీ ప్రాంగణంలో బసవేశ్వరుని మూర్తిని స్థాపించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో సమస్త లింగాయత్ యొక్క ఉన్నతిక ఈ ప్రభుత్వము ద్వారా బీదవారికి ఆర్థిక సహకారంతో లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పల్లెలో పట్టణంలో బసవ భవనానికి ప్రభుత్వం స్థలము కేటాయించి బసవ భవనాన్ని నిర్మించి ఇవ్వాలన్నారు. జనాభా అనుసారము లింగాయతులకు ఎంపీ  ఎమ్మెల్యే సీట్లను ప్రాధాన్యతగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని వారు సూచించారు. జనాభా ప్రాతిపదికన లింగాయత్ కుల ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించలన్నారు. మహా ర్యాలీకి తరలి వెళ్లిన వారిలో మల్లికార్జున్ పాటిల్ ధనుంజయ అశోక్ పాటిల్ గణేష్ నాగభూషణం తదితరులు మహారాణిలో పాల్గొనడానికి వందలాదిగా తరలి వెళ్లారు.