Friday, 6 November 2026

మహిళపై అత్యాచారం, హత్య

సికింద్రాబాద్ (జ‌నంసాక్షి) : గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ సంఘటన మంగళవారం సికింద్రాబాద్‌లోని మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు..గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌లోని పాత గాంధీ ఆస్పత్రిలో ఉన్న నిర్జన ప్రదేశానికి మహిళ ను తీసుకెళ్లి ఆమెను అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించి అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా గుర్తించారు. కాగా మృతురాలి ఆచూకి తెలియరాలేదు. పోలీసులు ఆధారాల కోసం డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *