-సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటర్ పుట్టపాగా సునిత.-పాలెం కృషి విజ్ఞాన కేంద్రం విద్యార్థులకు అవగాహన.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి28(జనంసాక్షి):సఖి కేంద్రం ద్వారా మహిళలకు,బాలికలకుకౌన్సెలింగ్,పోలీస్ సహాయం,న్యాయ సలహాలు,వైద్య సేవలు అందుతాయని సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటర్ పుట్టపాగా సునిత అన్నారు.శనివారం సఖి కేంద్రం ఆద్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని పాలెం లో కృషి విజ్ఞాన కేంద్రం విద్యార్దులకు గృహహింస,వరకట్న వేధింపులు, బాల్యవివాహాలు, లైగింక వేధింపులు, సైబర్ నేరాలపై అవగాహన కలిపించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటర్ పుట్టపాగ సునిత మాట్లాడుతూ సఖి కేంద్రం మహిళా శిశు సంక్షేమ శాఖ అద్వర్యం లో 24/7 పని చేస్తుందని అన్నారు.అవసరమున్న భాదిత మహిళలకు,బాలికలకు 5 రోజుల తాత్కాలిక వసతి కల్పించబడునని తెలిపారు.బాధిత మహిళా, బాలికల వివరాలు గోప్యం గా ఉంచుతామని అన్నారు.జిల్లాలో హింసకు లోనవుతున్న బాధిత మహిళలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్181కు లేదా సఖి కేంద్రం నంబర్ 99519 40181కు సంప్రదించగలరని తెలిపారు.సఖి కేంద్రం కార్యాలయం జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా లో గల వైభవ్ గార్డెన్ ప్రక్కన ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ ఆఫిఫా జహాన్ తదితరులు పాల్గొన్నారు.




