Tuesday, 3 November 2026

వడాయిగూడెం గ్రామ ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న గూడూరు నారాయణరెడ్డి

 

 

 

 

 

భువనగిరి టౌన్( జనం సాక్షి):—బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ గూడూరు నారాయణరెడ్డి గారు ఈ రోజు భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం దర్శనం,యాదవుల కులదైవమైన శ్రీ బుగ్గ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బిజెపి కార్యకర్తలు, బిఎంఎస్ కార్మికులు మరియు గ్రామ ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని , గ్రామంలో వాడవాడలా తిరిగి ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేను ముందు ఉంటానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి బిజెపి మండల అధ్యక్షులు నల్లమాస శేఖర్ గౌడ్, మండల కార్యదర్శి మాటూరి ఉపేందర్ గౌడ్, బిఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై రాజిరెడ్డి , విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి చుక్కల శ్రీశైలం యాదవ్,వడాయిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు బబ్బురి సురేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుకుట్ల రాము యాదవ్, ఉపాధ్యక్షులు ముద్దసాని రాజు గౌడ్, చుక్కల రామారావు యాదవ్ ,యువ మోర్చా అధ్యక్షులు నోముల భాను యాదవ్, శెట్టి మల్లేష్ యాదవ్, శెట్టి వంశీ యాదవ్, తిరుమల హెచ్చరిస్ బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి వల్లాల స్వామి యాదవ్, ఉపాధ్యక్షులు గోట్టేటి వెంకటేష్ ,బిఎంఎస్ మహిళా కార్యకర్తలు ఎస్ మంగ, ఇ మమత, సి హెచ్ లక్ష్మీ, ఎస్ అనసూయ, ఎస్ స్వప్న, ఎస్ మల్లమ్మ, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.