మహిళలకు ఆస్తిహక్కు కల్పించింది ఎన్టీఆర్‌రే:

-‘వస్తున్న..మీకోసం’ పాదయాత్రలో భాగంగా చంద్రబాబు
నల్గొండ :  మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు అన్నారు. శుక్రవారం ‘వస్తున్నా..మీకోసం’ పాదయాత్రలో భాగంగ నల్గొండ జిల్లా కోదాడ కిట్స్‌ కళాశాల విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దూరదృష్టి లేదని విమర్శించారు. తెదేపా హయంలో విద్యకు ప్రధాన్యం ఇవ్వడం వల్లే నేడు విదేశాల్లో మనవాళ్లు స్థిరపడ్డారని ఆయన తెలిపారు.