తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్దిక అభివృద్ధి కోసం కృషి చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మహిళా సంఘాల కు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు,మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చెస్తుందని అన్నారు. గతంలో ఒక సంఘానికి లక్ష రూ. రుణం రావడం కష్టం అవుతుండే కానీ తెలంగాణా ప్రభుత్వం లక్షలాది రూ.మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఇట్టి ఋణాలతో మహిళలు చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని మంత్ర ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విదంగా మన రాష్ట్రంలో మహిళా సంక్షేమ పథకాలు ఉన్నాయి.ఒంటరి,మహిళా పిన్షన్,ఆరోగ్య లక్ష్మి,తదితర పథకాలు అమలు చేసిందనున్నారు.రుణాలు పొందిన మహిళలు ఆర్థిక వృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో,ఆడిషినల్ కలెక్టర్ మంద మకరంద,డిసిఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేశ్,ఎంపీపీ లు ఎడ్ల చిట్టిబాబు, బాధినేని రాజమణి, లక్ష్మీ, జడ్పీటీసీ లు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ,మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సతేమ్మ,రైతు బంధు మండల అధ్యక్షుడు సౌల్ల భీమయ్యా, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీ లు మహిళలు, నాయకులు పాల్గొన్నారు.




