జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో స్థానిక హరిత హోటల్ లో సాయంత్రం ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ, కాంగ్రెస్ సేవకుల త్రివర్ణ పతాక సంరక్షకులం అంటూ మాట్లాడుతున్న గుమ్మడి కుమారస్వామి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఐ ఎన్ టి యు సి సభ్యుడు, సంస్కృతిలో ఆచార వ్యవహారాలకు నిలయమైన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చిన్ననాటి నుండి కాంగ్రెస్ జెండా భుజానికి ఎత్తుకొని పనిచేస్తున్నాం, విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ భావాజాలాన్ని నమ్మిన వాడను భారత ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవకు ముఖ్యంగా పేదల కోసం పరితపించిన తీరుకు ఆకర్షతుడన్నయ్యాను,కాక వెంకటస్వామి అనుచరులుగా, కాంగ్రెస్ పార్టీ సేవకులుగా ప్రచార సాధకులుగా నాయకులుగా అనేక కార్యక్రమాలు పోరాటాలు చేశాను. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కమ్యూనిస్టు నక్సలైట్లతో విరోచితంగా పోరాడిన చరిత్ర కలిగిన వ్యక్తిని గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి స్వంత ఖర్చులు పె చ్చించి పనిచేస్తున్నాను. సామాజిక వర్గానికి చెందిన వాడను ఎస్సీ మాల, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయడమే లక్ష్యంగా, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ వస్తున్నాను ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా, అసాంఘిక శక్తులు భయపెట్టిన, ప్రాణహాని తలపెట్టిన మొక్కోని ధైర్యంతో కాంగ్రెస్ జెండా ఎత్తుకొని, ఈ ప్రాంతంలో పార్టీ విస్తరణకు కార్యకర్తల సంరక్షణకు, పని చేస్తూ వస్తున్నాను, స్థానికులకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బొల్లి స్వామి జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వంగ లక్ష్మీపతి గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరస్స్ విజయ్ కుమార్ మాజీ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.




