మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. *జడ్పిటిసి మేఘమాల సంతోష్

జనం సాక్షి/ కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో మండల సమైక్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ ,సర్పంచి ఉమారాణి శ్రీకాంత్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కృషి చేస్తుందని. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు పంపిణీ చేస్తున్నారని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షులు వివోఏలు సిసి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు