మహిళల్ని గౌరవించే చోట అద్భుత పరిణామాలు ఆవిష్కృతమవుతాయి – డా. సత్యం శ్రీరంగం…కూకట్ పల్లి జనంసాక్షి :మహిళల్నిగౌరవించే చోటే అద్భుత పరిణామాలు ఆవిష్కృతమవుతాయని శ్రీరంఫౌండషన్ చైర్మన్ పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం అన్నారు. ప్రపంచ మహిళ దినోత్సవం సందర్బంగా కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ లోని దేవి గ్రాండ్ హోటల్ లో డా. సత్యం శ్రీరంగం కో చైర్మన్ ఆయన సతీమణి ఇందుమతి శ్రీరంగం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎం. సునీత రావు హాజరయ్యారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలను సంకల్ప్ ఫౌండేషన్ చైర్మన్ గుండ్ర రోజీ , డాన్ బాస్కో చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మద్ది కనకం రెడ్డి , అడ్వకేట్ మంజుల , ఎంట్రప్రెన్యూర్ గీత, న్యూట్రిషనిస్ట్ ఆశా దేవినేని, విశ్వ ధరణి ఫౌండేషన్ సభ్యురాలు భార్గవి లను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళ పురస్కారాలను అందజేశారు. నీరుపేద మహిళ పద్మకు సునీత రావు చేతుల మీదుగా కుట్టు మిషన్ ను అందించారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ప్రతి పురుషుడు తమ కుటుంబంలోని ఆడవాళ్లకు ప్రాముఖ్యత, వారి మాటకు విలువ ఇచ్చినపుడు ఆ సమాజంలో వారికి దక్కాల్సిన గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఒక మహిళా విజయం సాధిచాలంటే దాని కోసం ఆమె చేసిన కృషిని, ప్రతిభను గుర్తించాలన్నారు. అంతే కానీ వారి ఎదుగుదలను ఓర్వలేక వ్యక్తి గతమైన దుష్ప్రచారాలు చేసి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళలు దూసుకుపోతున్న అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా మహిళలు ముందుకు వెళుతున్నా కూడా ఎక్కడో ఒక చోట మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి ఉన్నంత ఓర్పు సహనం మహిళలకు ఉంటుంది మహిళలే సృష్టికి మూలం అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గారాణి, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, విజయ లక్ష్మి, రమాదేవి, జోజోమ్మ, రజిత, జ్యోతి, శోభ, సంధ్య, వరలక్ష్మి, అరుణ యాదవ్, రేణుక, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




