వైస్సార్ టిఎస్ కార్యాలయం ప్రారంభం.

 

 

 

 

 

 

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం దుర్గం నగేష్ నేత కో ఆర్డినేటర్ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ ప్రారంభం జరిగింది.వైస్సార్ తెలంగాణ పార్టీ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్ కుమార్ వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది..అనంతరం వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో బందిపోట్ల రాజ్యం నడుస్తుంది రానున్న రోజులలో తెలంగాణ ప్రజలంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన కోరుకుంటున్నారు.వైస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అక్క గారు తెలంగాణ కు కాబోయే మొదటి మహిళా ముఖ్యమంత్రి కచ్చితంగా అవుతారు..
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాశీ సతీష్ . ధర్మపురి ఇంఛార్జి ప్రేమ్ సాగర్.గౌరవ అధ్యక్షురాలు పద్మ .జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభుదేవ్ మహిళ అధ్యక్షురాలు జగటీ కల్పన ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు మూలకాల రాజేంద్రప్రసద్ బిసి సెల్ అధ్యక్షుడు పెద్దురి శ్రీనివాస్ ప్రియదర్శిని రాజేశ్వరి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కవి రాజ్ తదితరులు పాల్గొన్నారు…..జనం సాక్షి