Thursday, 5 November 2026

మహిళలు స్వయం ఉపాధి పథకాలపై దృష్టి సారించాలి – నాబార్డు డిడిఎం అనంత్

జనం సాక్షి , మంథని :
మహిళలు స్వయం ఉపాధి పథకాలపై దృష్టిసారించాలని నాబార్డు డిడిఎం (జిల్లా డెవలప్ మెంట్ మేనేజర్) అనంత్ పిలుపునిచ్చారు. మంథనిలో మహిళలకు ఎంబ్రాయిడింగ్ పై నెల రోజులుగా శిక్షణగా ఇవ్వగా, బుధవారం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అధితిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా డిడిఎం అనంత్ మాట్లాడుతూ, మహిళలు స్వయం ఉపాధి పథకాలపై శిక్షణ పొందడం వల్ల వారి కాళ్లపై వారు నిలబడంతో పాటు మరో పది మందికి వారి వల్ల ఉపాధి లభిస్తుందన్నారు. కెడిసిసి బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్ మాట్లాడుతూ, స్వయం ఉపాధిలో భాగంగా ఎంబ్రాయిండిగ్ పై శిక్షణ పొందిన మహిళలు తమ బ్యాంకు యందు దరఖాస్తు చేసుకుంటే వారికి తగు రుణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. మహిళలు కుట్లు, అల్లికలు నేర్చుకోవడం ద్వారా వారి కుటుంబానికి కొంత మేరకు ఆర్థికంగా వెసులుబాటుగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భ౦గా నాబార్డు డిడిఎం చేతుల మీదుగా మహిళలకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ, ఏపిఎం పద్మ, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.