హైదరాబాద్ : సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో మహిళల భద్రత కోసం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మహిళల కోసం ఐదంచెల భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఐటీ – పోలీసులకు మధ్య వారధిలా కౌన్సిల్ పని చేస్తుందని చెప్పారు. ఐటీ కారిడార్‌లో 47 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.





