మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలు
* సీఎం కేసీఆర్ మహిళా బంధు : ఆర్డీవో చెన్నయ్య, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్
మిర్యాలగూడ, జనం సాక్షి
మహిళల రక్షణ, సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ భరోసా కల్పిస్తోందని మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్య, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధుగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. బుధవారం పురపాలక సంఘం కార్యాలయంలో ఈనెల 14 వరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలను వారు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్ కట్ చేసిన తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. మహిళల స్వావలంబన, సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధుగా చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. మహిళ కుటుంబంలో, సమాజంలో అన్ని రకాలుగా వివిధ స్థాయిల్లో తన పాత్ర పోషిస్తుందన్నారు. గత ప్రభుత్వాల్లో మహిళలు అనుకున్న పురోగతి సాధించలేదని గుర్తించిన సీఎం కేసీఆర్ మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణ, పోషణ కోసం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే వారి అభివృద్ధి సాధ్యం అని నమ్మి ఆరోగ్య లక్ష్మి, భరోసా కేంద్రాలు, షి టీమ్స్ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల నుంచే ముందు ఆడపిల్ల గురించి ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. మహిళా కమిషన్ సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు బాగా పని చేస్తోందన్నారు. ఇందుకు వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు.
సమాజంలో సగ భాగం మహిళలు అని వారి కోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. ప్రతి విద్యార్థి వారి అమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మహిళలు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని సీఎం కేసీఆర్ నమ్మి అనేక అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. మహిళల భద్రత కోసం పెద్ద పీట వేశారు. దేశంలో మొదటి సారి ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల కోసం 53 డిగ్రీ గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మహిళలు సాధించిన విజయాలు, సాధించాల్సిన లక్ష్యాల గురించి మహిళా దినోత్సవం జరుపుకుంటారని గుర్తు చేశారు. సమాజం అభివృద్ధి జరగాలంటే మహిళలు, పురుషులు సమానంగా ఉండాలని అన్నారు. మహిళలకు సీఎం కేసీఆర్ అన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్నారని వారు తెలిపారు. అనంతరం పలువురు మహిళామణులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తిరునగర్ నాగలక్ష్మీ భార్గవ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, ఉదయ్ భాస్కర్, ఖాదర్, ఇలియాస్, తదితరులు పాల్గొన్నారు.




