నిర్మల్ బ్యూరో, మార్చ్08,జనంసాక్షి,, జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ లోగల వృద్దాశ్రమంలో వృద్దులకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు, బంగల్ పేటకు చెందిన ప్రభుత్వ ఉపాద్యాయులు బొద్దుల సునీత వెంకటరమణల పెళ్లిరోజు ని పురస్కరించుకుని బుధవారం నిరుపేదలైన వృద్దులకు అన్నదానం చేశారు. ఈసందర్భంగా వృద్దాశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ సునీత వెంకటరమణ లు అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు, పెళ్లిరోజు కు ఈరోజుల్లో యువత కేకులు కట్ చేస్తూ అనవసర ఖర్చులు చేస్తున్నారని,ఆలాంటి దుబారా ఖర్చులు చేయకుండా ఇలాంటి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తా బాగుంటదని అన్నారు.వృద్దులకు మా ఆశ్రమం లో ప్రాతినిధ్యం అన్నదానం చేస్తామని, కానీ పెళ్లిరోజు లకు,పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రత్యేక భోజనాలు పెట్టడం వలన వృద్ధులు ఆనందం వ్యక్తం పరుస్తారని అన్నారు.




