మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ.7.60లక్షల నిధులు కేటాయింపు
ఫోటో రైట్ అప్ :ఎమ్మెల్యేకు రాఖీలు కడుతున్న ఆర్పీలు
చొప్పదండి, ఆగస్టు 25 (జనం సాక్షి);చొప్పదండి పట్టణంలో మహిళా సంఘ భవన నిర్మాణం చేయాలని కోరుతూ చొప్పదండి పట్టణ మున్సిపల్ ఆర్ పిల యూనియన్ కమిటీ సభ్యులు శుక్రవారం బూరుగుపల్లి లోని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటికి వెళ్లి వినతి పత్రం అందజేయగా వెంటనే స్పందించి సంఘ భవన నిర్మాణానికి రూ 7.60 లక్షల నిధులు కేటాయించారు.ఈ సందర్భంగా ఆర్పీలు మాట్లాడుతూ చొప్పదండి పట్టణంలో గ్రామ సంఘాల నిర్వహణను గత 12 సంవత్సరాలుగా తహసిల్దార్ కార్యాలయం పక్కన ఉన్న బిల్డింగ్ లో చొప్పదండి పట్టణానికి సంబంధించిన మహిళా సంఘ సభ్యుల కు సంబంధించిన సమావేశాలు మహిళా సంఘ సభ్యుల అకౌంటు లావాదేవీలు తదితర విషయాలు చర్చించుకుంటామని పేర్కొన్నారు .బిల్డింగ్స్ స్లాబ్ పురాతనంగా ఉండడంతో స్లాబ్ లీకేజీ అవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని వెంటనే నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరమని తెలిపారు.ఎమ్మెల్యే స్పందించి రూ.7.60 లక్షల నిధులు కేటాయించరని పేర్కొన్నారు నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. భవన నిర్మాణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్యేలు ఆహ్వానించి నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ఆర్పీలు పాల్గొన్నారు