Monday, 2 November 2026

మహిళ కిడ్నాప్ కేసు నిందితుల అరెస్టు

హైదరాబాద్ అంబర్‌పేటలో మహిళను అపహరించిన కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. రూ. 4 లక్షలు అప్పు చెల్లించలేదని బాధితుడి భార్యను వడ్డీ వ్యాపారి తన బంధువులతో కలిసి అపహరించాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటలలోపు నిందితులను పట్టుకుని బాధితురాలిని సురక్షితంగా విడిపించారని చెప్పారు.  అటు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు.  కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను డీసీపీ సుమతి ఈ సందర్భంగా ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *