Monday, 2 November 2026

అడ్డంగా బుక్కయ్యాడు!

న్యూఢిల్లీ: సింగపూర్ మెట్రో రైల్లో తనను సీక్రెట్‌గా వీడియో తీస్తున్న కీచకుడిని ఓ మహిళ తెలివిగా పసిగట్టి రచ్చకీడ్చింది. శనివారం ఔట్రామ్ స్టేషన్ నుంచి హార్బర్‌ఫ్రంట్ వెళుతుండగా… పైకి మంచి హుందాగా కనబడుతున్న ఒకడు అదే రైలు ఎక్కాడు. బోగీ మొత్తం ఖాళీగానే ఉన్నప్పటికీ  సరిగ్గా ఆమె దగ్గరకు వెళ్లి  ఎదురుగా కూర్చున్నాడు. మెల్లగా సెల్‌ఫోన్ తీసి రహస్యంగా ఆమెను వీడియో తీయడం మొదలు పెట్టాడు. పైకి మాత్రం ఏమీ ఎరగనట్టుగా దిక్కులు చూస్తున్నప్పటికీ.. ఆ మానవమృగం చేస్తున్న పని అతడి వెనుకే ఉన్న కిటీకీ అద్దంలో కనిపించడంతో ఆమె అప్రమత్తమైంది.
వీడియో తీస్తున్న సంగతి ఆమె గుర్తించిన సంగతి తెలియక అతగాడు అలాగే చిత్రీకరిస్తూ కూర్చున్నాడు. దీంతో ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో తీసి ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే 50 లక్షల మంది ఈ వీడియో వీక్షించడంతో అతగాడి పరువు గంగలో కలిసిపోయింది. వీడియో సాక్ష్యం సంపాదించాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… అతడు కాళ్ల బేరానికి దిగాడు. ‘‘తప్పయిపోయింది క్షమించు… నువ్వు నా చెల్లిలాంటి దానివి’’ అని వేడుకున్నాడని ఆమె ఫేస్‌బుక్‌లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *