Wednesday, 4 November 2026

మహోన్నతమైన సంక్షేమ పథకాలతో మహిళల శ్రేయస్సుకి కృషి చేస్తున్నఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

 వికారాబాద్ రూరల్ జూన్ 13జనంసాక్షిమహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాలతో మహిళల శ్రేయస్సుకు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డి* వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్* లు పేర్కొన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోనినర్సింగ్ గౌలికర్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో* భాగంగా *తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలంగాణలో మహిళా సంక్షేమం యొక్క అమలు చరిత్రాత్మకమైనదని స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేస్తూ. కళ్యాణ లక్ష్మి / షాదీముబారక్, ఆరోగ్య లక్ష్మి, కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీస్ శాఖలలో 33% రిజర్వేషన్స్, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్స్, మహిళకు విఎల్ ఆర్, షీ టీమ్స్, వీ హబ్, తెలంగాణ పల్లెల్లో మహిళలు నీటి కోసం కష్టాలు పడకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీటినందిస్తూ… మహిళా సంక్షేమంతో సంక్షేమ రంగానికే ఊపిరి పోసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానిది మాత్రమే అన్నారు.
ముడుపెన్నడు ఎరుగని రీతిలో తెలంగాణ ఆడపడుచుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు. కళ్యాణ లక్ష్మి / షాది ముబారక్ పథకాల అమలుతో బాల్యవివాహాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని పేర్లు మార్చి అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్* అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ… ప్రజలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.మహిళా సమైక్య సంఘాల మహిళలకు స్త్రీ నిధి లోన్ చెక్కులు అందజేశారు.అనంతరం మహిళలను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ కమల్ రెడ్డి ఆర్డీవో విజయ కుమారి మున్సిపల్ స్టేర్ పర్సన్ మంజుల రమేష్ కుమార్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.