మాంరీa నాలుక కోసితెస్తే .11 లక్షలు బహుమతి
జితన్ రామ్ మాంరీaకి వ్యతిరేకంగా బీజేపీ నేత సవాల్
న్యూఢల్లీి,డిసెంబర్21(జనం సాక్షి ): బ్రహ్మణ సామాజికవర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంరీaని విమర్శిస్తూ బీజేపీ నాయకుడు గజేంద్ర రaా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాంరీa నాలుక కోసుకుని తన ముందుకు తెచ్చిన బ్రాహ్మణుడికి రూ.11 లక్షలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. పైగా మాంరీa విలువ 11 పైసలు కూడా ఉండదని వ్యాఖ్యానించారు. ’నేను ఒక ప్రకటన చేయదల్చుకున్నా. ఏ బ్రాహ్మణుడైతే జితన్ రామ్ మాంరీa నాలుక తెగ్గోసి నా ముందుకు వస్తాడో అతనికి నేను రూ.11 లక్షలు బహుమతిగా ఇస్తా. కాకపోతే మాంరీa విలువ 11 పైసలు కూడా చేయదు’ అని రaా ఎద్దేవాచేశారు. జితన్‌రామ్ మాంరీa ఈ నెల 19న ఓ వేదికపై ప్రసంగిస్తూ.. ’నేను నా సామాజికవర్గ ప్రజలకు చెప్పేదేమిటంటే.. ఈ రోజుల్లో నమ్మకం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ, పేదల సంక్షేమం పట్టించుకోవడంలేదు. పూర్వం షెడ్యూల్డ్ కులాలవాళ్లు పూజలను నమ్మేవారు కాదు. ఇప్పుడు పండితులు ఎస్సీల ఇండ్లలోకి వచ్చి పూజలు చేస్తున్నారు. అయితే, అక్కడ వాళ్లు తినడానికి ఏమిచ్చినా తిరస్కరిస్తున్నారు, కానీ డబ్బులను మాత్రం స్వీకరిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. తర్వాత ఈ వ్యాఖ్యలపై మాంరీa క్షమాపణ చెప్పారు.