మాజీమంత్రి ఫరీదుద్దీన్ సేవలు మరువలేనివి జడ్పీటీసీ స్వప్నభాస్కర్
జహీరాబాద్ డిసెంబర్ 29( జనం సాక్షి) : న్యాల్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,దివంగత మాజీమంత్రి ‘మహమ్మద్ ఫరీదుద్దీన్’ ప్రథమ వర్ధంతి సందర్భంగా జడ్పీటీసీ స్వప్నభాస్కర్ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మాజీమంత్రి ఫరీదుద్దీన్ సేవలు,పార్టీ అభివృద్ధికి వారు చేసిన కృషి ఎనలేనిది అని తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్ శివశంకరయ్య స్వామి,మాజీ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహా రెడ్డి,ఎంపీపీ రత్నం,వైస్ ఎంపీపీ గౌస్,సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు రవికుమార్,వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు,కోఆప్షన్ సభ్యులు రహీం,గ్రామ అధ్యక్షులు సత్యనారాయణ,ప్రవీణ్,శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు శ్రీకాంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి,సంజీవ్,ఈసం,మఖ్సూద్,సంగమేష్,ప్రవీణ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మాజీమంత్రి ఫరీదుద్దీన్ సేవలు మరువలేనివి జడ్పీటీసీ




