Tuesday, 3 November 2026

ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో ఐదు రోజుల నుంచి జరుగుతున్న జాతీయస్థాయి సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో

ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో ఐదు రోజుల నుంచి జరుగుతున్న జాతీయస్థాయి సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటుతూ ఫైనల్ కి దూసుకెళ్లారని అదిలాబాద్ ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ తెలిపారు, అండర్ 17 బాలుర సింగిల్స్ విభాగంలో షేక్ నూమేర్ మరియు రోహన్ రాజ్ కుమార్ ఫైనల్స్క చేరారు. అండర్ 15 మిక్స్ డబుల్స్లో కీర్తి మంచాల మరియు అమర్జిత్ లు బ్రాంచ్ మెడల్ సాధించారు, నైనిక రెడ్డి మరియు షికా అండర్ 17 విభాగంలో డబుల్ సెమి ఫైనల్స్ చేరుకోగా రోహన్ కుమార్ మరియు నూమేర్ షేక్లు అండర్ 17 బాయ్స్ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్ చేరుకున్నారు, అండర్ 15 బాయ్స్ డబుల్స్ విభాగంలో టీటీ జ్ఞాన దత్తు మరియు సూర్యాక్షి రావత్ లు సెమీఫైనల్స్ చేరుకున్నారు, రాష్ట్ర జట్టు కోచ్ నీల్ కమల్ అన్వేష్ సలహాలు సూచనలతో జట్టు మేనేజర్లు సుధాకర్, సత్యపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మన రాష్ట జట్టు క్రీడాకారులు సత్తా చాటుతున్నారు, ఫైనల్ కి చేరిన, సెమీఫైనల్కు చేరిన క్రీడాకారులను కోచులను మేనేజర్లను జిల్లా అధ్యక్షుడు ఏసిపి ఎడ్ల మహేష్, జిల్లా అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందించారు