మాజీమంత్రి వినోద్ సుడిగాలి పర్యటన.
బెల్లంపల్లి, జులై 15, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గంలో శనివారం మాజీమంత్రి గడ్డం వినోద్ సుడిగాలి పర్యటన చేశారు. బెల్లంపల్లి మండలం గురిజాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వంగ రామన్న ఇంటికి వచ్చి అల్పాహార విందు చేశారు. అనంతరం బెల్లంపల్లి, తాండూర్ మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల ముందు సమ్మెలో భాగంగా రిలే నిరాహార దీక్షలు చేసూన్న పంచాయతీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం బెల్లంపల్లి మండలం చిన్న బూద గ్రామంలో ఇటీవల కరెంటు షాక్ తో మరణించిన రాసకొండ ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రశాంత్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రాంచందర్, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు సింగతి సత్తన్న, తాండూర్ మండల అధ్యక్షుడు ఈసా, సింగల్ విండో చైర్మన్ చింతం స్వామి, నాయకులు జుమ్మిడి బానయ్య, బత్తుల రవి, జాడి మహేష్, గాలి శ్రీనివాస్, ఈశ్వర్, పోచంపల్లి హరీష్, రత్నం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు