జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల బీజేపీ ఇంచార్జ్ పోతరవేని క్రాంతికుమార్ తల్లీ లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించగా మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకట స్వామి , బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట బిఎస్ఎ నియోజకవర్గ ఇంచార్జ్ చిలువేరి సతీష్, పెద్దపల్లి పార్లమెంట్ ఐటీ సెల్ కన్వీనర్ భీమారపు సంపత్, పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్, మండల ఇంచార్జ్ తోట మధుకర్, మండల ఉపాధ్యక్షులు రేపాక శంకర్, సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్, బూడిద తిరుపతి తదితరులు పాల్గొన్నారు.




