జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన పిడుగు ఓదెలు ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్సపొంది మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫారసు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పిడుగు ఓదెలు కు 28.000 /- రూ మంజూరు కాగా ఇట్టి చెక్కును జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు గురువారం లబ్ధిదారు ఇంటికి వెల్లి బిఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండలశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కొండ వెంకటేష్, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనవేన వేణు, పెంచికల్ పేట్ మరియు గుండారం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఎద్దు రాజయ్య, దండే కిషన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ రవి, గొడిశెల సంపత్, ఇరుగురాల కిష్టయ్య, బైరి అంజయ్య, దండే రమేష్ ఠాగూర్, ఐట్ల పవన్ కళ్యాణ్, కుమ్మరి రమేష్, సిరవేణి రాజు, జంగిలి రవి, సాన సురేష్, దాసరి మోగిలి, ధబ్బేట కిష్టయ్య లతో పాటు తదితరులు పాల్గొన్నారు.




