హైదరాబాద్: మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.వెంకట్రామిరెడ్డి(84) కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1987 నుంచి 1993 వరకు వెంకట్రామిరెడ్డి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. వెంకట్రామిరెడ్డి స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని మల్లెంపూడి.




