మోమిన్ పేట జూన్ 28 జనం సాక్షి
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మోమిన్ పేట మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య తోపాటు జనార్దన్ రెడ్డి మాణిక్ రెడ్డి వారి అనుచరులు పట్లోళ్ల మల్లారెడ్డి ఆయన అనుచరులు లక్ష్మారెడ్డి అనంతయ్య వారి అనుచరులు కాశీనాథ్ ప్రతాప్ రెడ్డి వారి అనుచరులు దాదాపు 200 మంది మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు బుధవారం మోమిన్ పేట మండల కేంద్రంలోని రాయల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ బిజెపి టిడిపి పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి గద్దె దింపాలని లక్ష్యంతో పని చేయాలన్నారు 9 సంవత్సరాల కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి కుటుంబ పాలన నడుస్తుందని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నె శంకర్ యాదవ్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ సుభాష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ మాణయ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్ జిల్లా నాయకుడు సురేందర్ రాజు మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు మొహమ్మద్ అస్లాం మహేందర్ శ్రీనివాస్ రెడ్డి మహేందర్ చారి చంద్రయ్య ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బి ఆర్ఎస్ బిజెపి టిడిపి నాయకులు




